Type Here to Get Search Results !

Employees Service Rules - సర్వీసు అంశాలు

ఉద్యోగ,ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు - Employees Service Rules - Vinays Badi

  • లీను: ఒక పోస్టుపై ప్రభుత్వ ఉద్యోగి కి ఒక నియమిత కాలం వరకు గల హక్కు.ఇది శాశ్వత పోస్టు లేదా టెన్యూర్ పోస్టు అయినా ఉంటుంది. FR-9(13)
  • ఫారిన్ సర్వీసు: ఒక ఉద్యోగి ప్రభుత్వ అనుమతితో సంచిత నిధి నుండి కాక,ఇతర వనరుల ద్వారా భత్యo పొందుతూ చేయు సేవ. FR-110-127
  • 45 సం॥ నిండిన వారు కనీసం సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొని వారికి ప్రమోషన్ కల్పించవచ్చు.
  • (G.O.Ms.No.225 GAD Dt:!18-05-1999)
  • ఉద్యోగిని సరైన కారణాలు లేకుండా సస్పెండ్ చేస్తే,దానికి బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టవచ్చు - (Memo.No.2213/Ser.C/93-6 GAD Dt:30-11-1996)
  • ఉద్యోగిని సస్పెన్షన్ లో గరిష్ఠంగా 2 సం॥ మించి ఉంచరాదు.(U.O.Note.No.2776/SCE/98-1 GAD Dt:03-12-1998)
  • సస్పన్షన్ మూలంగా ఏర్పడిన ఖాళీని వేరే వారితో భర్తీచేయరాదు. -  (G.O.Ms.No.189 GAD Dt:20-04-1999)
  • వికలాంగ ఉద్యోగులకు  కన్వేయన్స్ అలవేన్స్ ను CL మినహా ఏ రకమైన సెలవులో ఉన్నా లేదా దసరా,సంక్రాంతి,వేసవి సెలవుల కాలంలోనూ కాన్వేయన్స్ అలవెన్స్ చెల్లించరాదు.(G.O.Ms.No.226 Dt:05-09-1981)
  • సరెండర్ లీవు (Surrender Leave) కాలానికి పూర్తివేతనం,ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి.IR చెల్లించబడదు. తెలంగాణ ఇంక్రిమెంట్ చెల్లించబడుతుంది.(Memo No.31948 F&P తేది:12-08-1998)(Memo No.3572/107/A1/Admn.I/2014 Dt:15-12-2014)
  • మృత శిశువు జన్మించినా,జన్మించిన తరువాత శిశువు మరణించినా ప్రసూతి  సెలవు (Maternity Leave) కు అర్హులు.(L.Dis.No.1941 Dt:11-06-1990)
  • ప్రసూతి సెలవులో  (Maternity Leave) ఉండి బదిలీ,పదోన్నతి పొందిన సందర్భంలో లీవ్ పూర్తయిన అనంతరం నూతన పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.(Rc.No.29 Dt:25-01-2003)(Rc.No.3750 Dt:13-08-2009)
  • LTC లో ప్రతి 4 సం॥ కాలం బ్లాకు పీరియడ్ గా నిర్ణయించబడుతుంది.మొదటి 2 సం॥ స్వస్థలం (Home Town) పోవుటకు ,తదుపరి 2 సం॥ కాలం రాష్ట్రంలో ఏ ప్రదేశమునకు గాని లేదా స్వస్థలం (Home Town) నకు గాని,సర్వీసు మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా LTC సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. 3,500 కి.మీ లు మించకుండా ప్రయాణం చేయాలి.రూ.18,750 చెల్లిస్తారు.బ్లాకు పీరియడ్ ను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా విడుదల చేయాలి.(G.O.Ms.No.76 Dt:13-05-2015)
  • కారుణ్య నియామకాలలో భాగంగా 18 సం॥ కన్నా తక్కువ వయస్సున్న వారిని ఉద్యోగంలో నియమించుటకు అలాగే 34 సం॥ మించియున్న వయస్సు వారిని ఉద్యోగంలో నియమించుటకు అవకాశం లేదు.అయితే భార్య/భర్త లకు ఉద్యోగం ఇచ్చు సందర్భంలో వారి గరిష్ట వయస్సు 45 సం॥ గా నిర్ణయించడం జరిగింది.(G.O.Ms.No.759 GAD Dt:06-10-2007)(G.O.Ms.No.144 GAD Dt:15-06-2004)
  • సస్పెండ్ అయిన ఉద్యోగికి  జీవనాధార భత్యము (Subsistence Allowance) తిరస్కరించరాదు.అట్టి చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరం.(Govt.Memo.No.29370/A/458/FR-II/96 F&P Dt:14-10-1996)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.