Type Here to Get Search Results !

3.బతుకమ్మ ఆడుదాం!(Bathukamma Adudam)

3.బతుకమ్మ ఆడుదాం!(Bathukamma Adudam)

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో - బంగారు బతుకమ్మ ఉయ్యాలో

కరుణించ రావమ్మ ఉయ్యాలో - కాపాడి మమ్మేలు ఉయ్యాలో

శాంకరీ పార్వతీ ఉయ్యాలో - శాంభవీ నీవమ్మ ఉయ్యాలో

కాశిమల్లె పూలు ఉయ్యాలో - కనకాంబరాలతో ఉయ్యాలో

మందారపూవుల ఉయ్యాలో - మాత నిను పూజింతు ఉయ్యాలో

పారిజాతం బంతి ఉయ్యాలో - బీరపూవుల తోడ ఉయ్యాలో

సీతజడ పూలతో ఉయ్యాలో - శ్రీలక్ష్మి పూజింతు ఉయ్యాలో

మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో - మా తల్లి నీవమ్మ ఉయ్యాలో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.