ZoyaPatel
Ahmedabad

4. బతుకమ్మలెత్తుదాం! - Bathukammalethudam

4. బతుకమ్మలెత్తుదాం! - Bathukammalethudam

బతుకమ్మలెత్తుదాం! - Bathukammalethudam

తీరొక్క రంగూల ఉయ్యాలో

రామచిలుకలోలె ఉయ్యాలో

ఓణీలు జడకుచ్చులు ఉయ్యాలో

ఒయ్యార మొలకంగ ఉయ్యాలో

బుట్టబొమ్మాలోలె ఉయ్యాలో

బుజ్జిపాపలు కదిలె ఉయ్యాలో

అద్దాల రవికెలు ఉయ్యాలో

ముత్యాల చీరెలు ఉయ్యాలో

నడుముకూ వడ్డాణం ఉయ్యాలో

నాణ్యమైన నగలు ఉయ్యాలో

నిండైన గాజుల్ల ఉయ్యాలో

బతుకమ్మలెత్తిరి ఉయ్యాలో

బాజ భజంత్రీలు ఉయ్యాలో

సన్నాయి డప్పుల్ల ఉయ్యాలో

నడిచేటి పాదాలు' ఉయ్యాలో

నదులనూ బోలు ఉయ్యాలో

వాడవాడేకమై ఉయ్యాలో

ఊరి మధ్యన చేరి ఉయ్యాలో

సొంపైన పాటల్ల ఉయ్యాలో

బతుకమ్మలాడిరి ఉయ్యాలో

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post