Type Here to Get Search Results !

Commutation Leave Rules in Telugu | Commuted Leave

ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్(Commutation)" గా పరిగణిస్తారు.

ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని, చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.

Commutation Leave Rules in Telugu | Commuted Leave - Vinays Badi

Commutation Leave Rules in Telugu

  • (G.O.Ms.No.158 F&P తేది:1-4-1999) --- శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.
  • (Rule 3(3) of Commutation Rules 1994)---కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.
  • (G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)----పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.
  • (G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)---15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.
  • (G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)---కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.
  • (G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)---కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.

Related searches:-
  1. commutation leave rules
  2. commutation leave application
  3. commuted leave
  4. commuted leave rules in ap
  5. commuted leave rules in telangana
  6. commuted leave without medical certificate
  7. commuted meaning in telugu
  8. commuted leave medical certificate
  9. commuted leave during covid-19
  10. కమ్యుటేషన్ సెలవు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.