Type Here to Get Search Results !

బతుకమ్మ పేరుద్దాం(Bthukamma Peruddam)

బతుకమ్మ పేరుద్దాం(Bthukamma Peruddam)

బతుకమ్మ పేరుద్దాం(Bthukamma Peruddam) - Scert telangana Vinays Badi

తీరైన పువ్వులనూ కోల్ - ఏరీ తెచ్చామూ కోల్

రంగుల పూలన్నీ కోల్ - రాసులుగా పోసీ కోల్

సిబ్బిల ఆకులూ కోల్ - సిత్రంగా పరిచీ కోల్

దోసిట్ల పూలన్నీ కోల్ - దొంతులుగా పేర్చీ కోల్

అమ్మమ్మ చెప్పంగా కోల్ - అందంగా తీర్చీ కోల్

ఇంట్లోని వారంతా కోల్ - పూజలె చేయంగా కోల్

గౌరీశంకరున్నీ కోల్ - భక్తితో కొలువంగా కోల్

ఘనమైన బతుకమ్మా కోల్ - ఫలములనివ్వమ్మా కోల్

ఊరూ ఊరంతా కోల్ - ఉత్సవమే నిండా కోల్

ఓయమ్మలక్కలూ కోల్ - రండీ పోదామూ కోల్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.