ZoyaPatel
Ahmedabad

దేవుని సృష్టి | Devuni Srushti | Telugu Stories

రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒక రోజు పనిమీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు.

ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచే సరికి బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించినది. దాని నీడలో విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరు దాము అనుకున్నాడు.

ఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది, దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి, అని ఆశ్చర్యపోతూ మర్రిచెట్టు వైపు వెళ్లాడు.

అక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంతా చిన్న కాయల.

ఇది మరీ అన్యాయం అనుకొని కన్న గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రి కాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడి కాయలు కా ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన కూర్చున్నాడు.

ఇంతలో గాలికి మర్రిచెట్టు కోమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తల పై పడింది వెంటనే, ఉలిక్కిపడి. దేవుడు చాలా తెలివైనవాడు. కాబట్టి అలా సృష్టించాడు.

లేకపోతే మర్రిచెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలు అయిపోయింది అనుకున్నాడు. దేవుడిని తప్పు పట్టడం ఆ తెలివి తక్కువ తనం అనుకున్నాడు.

నీతి: ప్రకృతిని, సృష్టిని ఎవరు తప్పు పట్టరాదు.

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post