గోరంత దీపము కొండంత వెలుగు - Gorantha Dipam Kondantha Velugu
MUKKANI BROTHERS
గోరంత దీపము కొండంత వెలుగు
మా ఇంటి పాపాయి మాకంటి వెలుగు
వెచ్చని సూరీడు పగలంత వెలుగు
చల్లని చంద్రుడు రాత్రంత వెలుగు
ముత్యమంత పసుపు ముఖమంత వెలుగు
ముత్తైదు కుంకుమ బ్రతుకంత వెలుగు
గురువు మాట వింటే గుణమంత వెలుగు
మంచి చదువులు నీకు భవిషత్తు వెలుగు"