ZoyaPatel
Ahmedabad

తెలివైన కాకి కథ | Story of a wise crow | Telugu Stories

  తెలివైన కాకి కథ | Story of a wise crow | Telugu Stories

అనగనగా ఒక కాకి, ఆ కాకి కి చాలా దాహం వేస్తుంది.  ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించ లేదు. దానికి ఎండాకాలము  కావడం చేత ఎండలు మండిపోతున్నాయి.


దాహాన్ని తట్టుకోలేక బాధపడుతుంది కాకి. చెరువులు, కుంటలు, వాగులు అన్నీ ఎండిపోయినవి. కాకి అటు ఇటు ఎగురుతూ నీటి కొరకు చూస్తుంది.


కొంత దూరంలో దానికి ఒక ఇల్లు కనిపించింది. వెంటనే ఎగిరిపోయి ఇంటి పై వాలింది. చుట్టుపక్కల నీటి కొరకు చూసింది.


కొంత దూరంలో ఒక కుండా కనిపించింది కాకి కి. నీళ్ళు తాగడానికి కుండా వద్దకు పోయినది కాకి. కుండ లోకి వంగి  చూసినది కానీ దానికి నీళ్లు అందలేదు.


కుండలో అడుగున ఉన్న నీళ్లు త్రాగడానికి ఆలోచించింది. కాకి దొరక దొరక దొరికిన నీళ్లు ఎలాగైనా తాగాలని అనుకున్నది.


ఒక ఉపాయం ఆలోచించాలి అనుకుంటూ చుట్టుపక్కల చూసింది. పక్కన కొన్ని గులకరాళ్లు కనిపించాయి. ఆ రాళ్లను చూడగానే ఒక ఆలోచన  వచ్చినది కాకి కి.


ఒక ఒక రాయిని నోటితో పట్టుకొని ఆ కుండలో వేసింది. కొన్ని రాళ్ళను వేయగానే కుండలోని నీరు పైకి వచ్చినవి. కాకి ఆ నీటిని తాగి దాని దాహం తీర్చుకుంది.


కథలోని నీతి:

ఆలోచనతో ఏ పనినైనా సాధించవచ్చు.

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post