Type Here to Get Search Results !

క్లస్టర్ రిసోర్సు పర్సన్ - Cluster Resource Person(CRP) జాబ్ ఛార్ట్

క్లస్టర్ రిసోర్సు పర్సన్ - Cluster Resource Person(CRP) జాబ్ ఛార్ట్

  • పాఠశాల సముదాయం సమావేశ నిర్వహణలో కిందిఅంశాలలో పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులకు, అసిస్టెంట్ సెక్రటరీకి సహకరించడం.
  • సమావేశ నిర్వహణ ఏర్పాటును చేయడం, సమావేశ అజెండాను అనుబంధ పాఠశాలలకు తెలపడం. సమావేశ మినిట్స్ ను సంబంధిత రిజిష్టరులో నమోదు, డాక్యు మెంటేషన్ నివేదికను రూపొందించడం. సమావేశానికి మాదిరి పాఠ్యాంశ ప్రదర్శనకు, ఇతర సెషన్లకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చడం.
  • సమావేశంలో విషయ నిపుణుడిగా వ్యవహరించడం.
  • సమావేశ నిర్వహణకు అవసరమైన మానవ వనరులను గుర్తించడం వారి సేవలను వినియోగించుకోవడం.
  • ఉపాధ్యాయులకు ఒక విషయ నిపుణుడిగా సాయమందించడం,
  • మాదిరి పాఠ్యాంశ ప్రదర్శనను ఇవ్వడం
  • ఉపాధ్యాయులకు వృత్తిపరమైన సాయాన్ని అందించడం.
  • వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కఠిన భావనలకు బోధనాభ్యసన సామగ్రిని రూపొందించడం. అన్ని సబ్జెక్టులలో ప్రశ్నా నిధులు, పరీక్షాంశాలను రూపొందించడం.
  • ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న తరగతికి పూర్తిచేసిన సిలబస్ ప్రకారం సొంతంగా ప్రశ్నాపత్రాలను రూపొందించుకోవడంలో తగిన సాయం అందించడం.
  • వృత్యంతర శిక్షణ కార్యక్రమాలలో విషయ నిపుణుడుగా వ్యవహరించడం.
  • పాఠశాలల్లో అమలులో ఉన్న వివిధ గుణాత్మక కార్యక్రమాలను మానిటరింగ్ చేయడం. + డేటాబేస్ నిర్వహణ.
  • క్లస్టర్ పాఠశాలల నుండి డేటాను సేకరించడం, క్రోడీకరించడం.
  • క్లస్టర్‌కు అనుసంధానం చేయబడిన ఆవాసప్రాంతాలలోని 6-14సం||ల వయస్సుగల పిల్లలందరి సమాచారాన్ని సేకరించడం.
  • క్లస్టర్ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న భౌతిక సదుపాయాలు, ఇంకా అవసరమున్న భౌతిక సదుపాయాలు మొదలగు వివరాలను సేకరించడం.
  • ఉపాధ్యాయుల డేటా బేస్ భోదనోపకరణాలు - టివి, రేడియో, ఆరిసిసిపి, డివిడి ప్లేయర్, డిష్ అంటెన్నా, గణితం / సైన్స్ కిట్లు, ఛార్జులు, నమూనాలు,  మ్యాపులు, పాఠ్య పుస్తకాలు, కంప్యూటర్, ప్రయోగశాల పరికరాలుమొ॥ వాటిని నిర్వహించడం, వినియోగించడం.
  • పాఠశాల సముదాయం గ్రంధాలయ నిర్వహణ -స్టాక్ రిజిస్టర్‌లో గ్రంధాలయ పుస్తకాలను నమోదు చేయడం. రిఫరెన్స్ పుస్తకాలను ఉపాధ్యాయులకు ఇవ్వడం, తిరిగి తీసుకోవడం. ఈ వివరాలను ఇష్యూ రిజిష్టర్ లో నమోదు చేయడం.
  • గ్రంధాలయ పుస్తకాలు / మ్యాగజైన్లు సమకూర్చు కోవడంలో సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించడం.
  • పాఠశాల సమూదాయానికి సంబంధించిన అన్ని రికార్డులను నిర్వహించడం.
  • క్లస్టర్ స్థాయి ఎగ్జిబిషన్లు, మేళాలు మొ|| నిర్వహిం చడంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించడం
  • బడిబయటి పిల్లల కొరకు ముఖ్యంగా పని నుండి విముక్తి పొందిన బాలకార్మికుల కోసం ఉద్దేశించబడిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడం.
  • పాఠశాల సముదాయ విధులలో - నమోదు, నిలకడ, సామర్థ్యాల సాధనలో నాణ్యతలలో ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని నమోదు చేయడంలో సహకరించడం.
  • పాఠశాలల్లో నమోదు కాని, ద్రాపౌట్ అయిన పిల్లల చదువు గురించి కృషి చేయడంలో తన వంతు పాత్రను పోషించడం.
  • పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు అకడమిక్ అంశానికి సంబంధించి అప్పగించే ఏ ఇతర పనినైనా నిర్వర్తించడం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.