ZoyaPatel
Ahmedabad

Bhasha Bhagaalu(భాషా భాగాలు)

 

భాషా భాగాలు


తెలుగులో భాషా భాగములు ఐదు అవి -

భాషాభాగము

ఉదాహరణ

1. నామవాచకము
ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.
ఉదా - రాముడు,రవి,గీత
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం
2. సర్వనామము
నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.
ఉదా - అతడు, ఆమె, అది, ఇది...
రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.
ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.
3.విశేషణము
విశేషణం: నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.
ఉదా - మంచి బాలుడు
4. అవ్యయము
లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు
ఉదా- అక్కడ
5.క్రియ
పనులను తెలుపు పదములను క్రియలందురు.
ఉదా - తినటం, తిరగటం, నవ్వటం...
Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post