Type Here to Get Search Results !

అర్థజీతపు సెలవు (Half Pay Leave)

అర్థజీతపు సెలవు (Half Pay Leave) - Vinays Badi

◾ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

◾సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)

◾ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.

◾అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

◾అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

  1. వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
  2. స్వంత వ్యవహారాలపై (Private Affairs)

◾సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

◾ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

◾వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. {APLR 15(B) & 18(B} 

◾కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975)

◾ సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}

◾ ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

◾ వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

◾ వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011) 

◾అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

◾ క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.(G.O.Ms.No.386 Dt:06-09-1996)(G.O.Ms.No.449 Dt:19-10-1976)

◾ వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.(G.O.Ms.No.29 Dt:09-03-2011)

 ◾ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు.(G.O.Ms.No.143 Dt:01-06-1968)

◾ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

◾ సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.