సంక్రాంతి సెలవుల పై ప్రిఫిక్స్ - సఫిక్స్ వివరణ
▪️సెలవులు 9 రోజుల లోపు ఉంటే Closing day కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. (RC NO:815, Dated 01.09.1999) కానీ CLs మరియు సెలవులు కలుపుకుని మొత్తం 10 రోజులు మించితే మొత్తం రోజులు other than CL (OCL) పెట్టుకోవాల్సి ఉంటుంది. అనగా ELs తో గాని HPLతో గాని ఆ సెలవులను భర్తీ చేయాల్సి ఉంటుంది.
▪️ఈసారి సంక్రాంతి సెలవులు 13.01.2025 నుండి 17.01.2025 వరకు 5 రోజులు కలవు. కానీ 11.01.2025 రెండవ శనివారము 12.01.2025 రోజు ఆదివారము కలుపుకొని మొత్తం ఏడు రోజులు కలవు. కావున 10.01.2025 తేదీన లేదా 18.01.2025 తేదీన CL పెట్టుకోవడానికి అవకాశం కలదు.
▪️NOTE: 10వ తేదీ మరియు 18 వ తేదీ రెండు రోజులు కూడా CL పెట్టుకోవచ్చు.19 వ తేదీ ఆదివారం కావున అప్పుడు 20 వ తేదీ నాడు తప్పకుండా హాజరు కావాలి.లేనిచో ప్రభుత్వ సెలవులు మరియు CL లు కలిపి 11 రోజులు అవుతాయి కావున మొత్తం 11 రోజులు HPL/EL పెట్టుకోవల్సి ఉంటుంది.*
▪️సెలవులు (Term Holidays) 10 రోజుల కంటే ఎక్కువ,15 రోజుల కంటే తక్కువ* *(10,11,12,13,14,15) ఉన్న సందర్భంలో Closing day గాని Opening day గాని CL పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి closing day and opening day రెండు రోజులు పాఠశాలకు తప్పకుండా హాజరు కావాలి. (RC NO:10324, DATED; 7.11.1969)*
▪️ఒకవేళ సెలవులు 16 రోజులు అంతకు మించి ఉన్నట్లయితే వాటిని వెకేషన్ అంటారు.అప్పుడు Opening day గాని Closing day గాని OCL(Other than CL) పెట్టుకోవడానికి అవకాశం ఉంది.