Type Here to Get Search Results !

3.ఆట(ఆ, ట) - 1వ తరగతి తెలుగు

3.ఆట(ఆ, ట) - 1వ తరగతి తెలుగు

ఏ ఆట నీకిష్టం చెల్లెలా? 
ఏ ఆట నీకిష్టం తమ్ముడా? 
గురిపెట్టి కొట్టేటి
గోటీల ఆటనా?
గవ్వలతొ ఆడేటి 
పచ్చీసు ఆటనా?
పెంకాసు ఏసెటి
ఏ తొక్కుడూ బిళ్లనా?
॥ ఏ ఆట ॥

గుండ్రంగ తిరిగేటి
తిరిగే బొంగర ఆటనా? 
కట్టెతో కొట్టేటి 
చిర్రగోనె ఆటనా? 
చేతులతో చప్పట్ల 
చెమ్మ చెక్క ఆటనా? 
    ||ఏ ఆట ॥

ఆటలన్నీ ఇష్టమే ఓ అక్క!

ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.