Type Here to Get Search Results !

అమ్మ పాట గేయం - Amma Pata Telugu Vegam(Rhyme)

 అమ్మ పాట గేయం - Amma Pata Telugu Vegam(Rhyme)

ఆటలంటే మాకిష్టం - పాటలంతే మాకిష్టం

ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మా కిష్టం

సినిమాలంటే మా కిష్టం - మిఠాయిలంటే మా కిష్టం

సినిమాలకన్నా మిఠాయిలకన్నా- షికార్లు అంటే మా కిష్టం

పిట్టలంటే మా కిష్టం - పువ్వులంటే మా కిష్టం

పిట్టల కమ్న్నా పువ్వులకన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం

కొత్త బట్టలు మా కిష్టం - పౌడరు స్నోలు మాకిష్టం

బట్టల కన్నా పౌడరు కన్నా  - మట్టిలో ఆటలు మాకిష్టం

టీచర్లంటే మా కిష్టం - పాఠాలంటే మాకిష్టం

టీచరు కన్నా పాఠం కన్నా - బడి సెలవంటే మాకిష్టం

వెన్నెలంటే మా కిష్టం - వానలంటే మాకిష్టం

వెన్నెల కన్నా వానలకన్నా - అమ్మ ముద్దులే మాకిష్టం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.