ZoyaPatel
Ahmedabad

అసాధారణ సెలవు - Extra Ordinary Leave on Loss of Pay

అసాధారణ సెలవు ( Extra Ordinary Leave on Loss of Pay ) - Vinays Badi

◾ఉద్యోగికి ఏ సెలవు అందుబాటులో లేనప్పుడు (లేదా) ఇతర సెలవులున్నప్పటికి వ్రాతపూర్వకంగా అసాధారణ సెలవు మంజూరు కొరినప్పుడు ఈ సెలవును మంజూరు చేస్తారు.

అసాధారణ సెలవు - Extra Ordinary Leave on Loss of Pay

◾ఈ సెలవు కాలమును సీనియార్జీ. పదోన్నతులకు లెక్కిస్తారు. ఒకేసారి 5సం॥|లకు మించి ఈ సెలవులో ఉన్నచో ఉద్యోగము నుండి తొలగించబడినట్లు భావింపబడుతుంది.

◾ఈ రకపు సెలవును 3సం|లకు వరకు పెన్షన్ను లెక్కలోనికి తీసుకుంటారు EOL కు సరిపడా దినములు ఇంక్రిమెంట్లు వాయిదాపడును.

◾శాస్త్ర సాంకేతిక చదువుల నిమిత్తంగాని, అనారోగ్య కారణంగా గాని జీత నష్టపు సెలవు తీసుకొనినచో ఆరునెలలు వరకు డైరెక్టరు, ఆరునెలల పైబడినచో ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఇంక్రిమెంట్లు వాయిదా పడకుండా అనుమతించవచ్చు. 

◾(G.O.MS.No.214 F&P dt:3.9.96) ప్రకారం 5సం॥లు జీతము లేని సెలవుపై ప్రభుత్వ అనుమతి పాంది విదేశాలలో ఉద్యోగమునకు వెళ్లవచ్చును. పై చదువులకు వెళ్లదలచిన ఉద్యోగులకు  వేతనముతోగాక EOL పై మాత్రమే అనుమతించబడినది. 

◾(Memo No. 13422/C/274/FR-1/2009 dt.21.5.2009) ప్రభుత్వ ఉద్యోగుల సెలవు విషయంలో 1933 నాటి సెలవుల నియమావళికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Ms.No.129 dt.1.6.2007) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 5-ఎ రూల్ తరువాత 5-బి రూల్ పేరుతోకలిసిన ఈ సవరణల ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి ఉద్యోగానికి గైర్హాజరైతే కూడా రాజీనామా చేసినట్లుగా భావిస్తారు. అయితే రాజీనామా చేసినట్లుగా పరిగణించడానికి ముందు కారణాలను వివరించేందుకు తగిన అవకాశం కల్పిస్తారు. 

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post